ఏం సెప్పితిరి సారూ : మహాభారతం కాలంలోనే ఇంటర్నెట్ ఉంది

internet-old-daysఇండియాలో మహాభారత్ కాలం నుంచే ఇంటర్నెట్, శాటిలైట్ మనుగడలో ఉన్నాయని, కొత్తేమి కాదని తెలిపారు త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దెబ్. కంప్యూటరైజేషన్, సంస్కరణలపై అగర్తలలో జరిగిన ఓ వర్క్ షాప్ లో మాట్లాడిన ఆయన..లక్షల సంవత్సరాల క్రితమే భారత్ ఇంటర్నెట్ ను కనుగొన్నదన్నారు. మహా భారత్ కాలం నుంచే భారత్ లో ఇంటర్నెట్, శాటిలైట్ సేవలు ఉన్నాయని..ఇందుకు కురుక్షేత్రంలోని ఓ సంఘటనను ఉదాహారణగా చెప్పారు సీఎం.

 

ధ్రుతరాష్టుడి రథసారధి సంజయుడు. చూపులేని ధ్రుతరాష్టుడికి కురుక్షేత్ర యుద్ధం గురించి సవిరంగా సంజయ ఎలా చెప్పగలిగాడు.. అంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారత్‌ లో అందుబాబులో ఉందని అర్థమన్నారు. వాటి సహాయం ద్వారానే సంజయ యుద్ధం గురించి చెప్పాడన్నారు. యూనైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌ లు తమ ఆవిష్కరణలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వాస్తవానికి అది భారతీయ సాంకేతికతన్నారు. గొప్ప సాంస్కృతిక చరిత్ర జాతి సొంతమన్నారు. దానిపట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నానన్నారు.

ఇప్పటికే సాంకేతిక రంగంలో మనమే ముందున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ యూఎస్ సంస్థే కావచ్చు. అయితే అందులో పనిచేసే ఇంజినీర్లు అత్యధికులు మన దేశానికి చెందినవారేనన్నారు. మహాభారత కాలం నుంచి టెక్నాలజీలో భారత్ ముందున్నదని.. మధ్యలో అది కనుమరుగైందన్నారు. తిరిగి ప్రస్తుతం మళ్లీ టెక్నాలజీలో దూసుకెళ్తుందన్నారు. ప్రపంచానికి అత్యధిక ఇంజినీర్లను అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Posted in Uncategorized

Latest Updates