ఏఓబీలో ఎన్ కౌంటర్… వరంగల్ మావో నేత ప్రమీల అలియాస్ జిలానీ బేగం మృతి

వరంగల్: ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళా మావోయిస్ట్ నేత జిలానీ బేగం మృతి చెందింది. నిడిగొండ ప్రమీల అలియాస్.. మీనా అలియాస్… జిలాని బేగంగా ఆమెను గుర్తించారు. చనిపోయిన నిడిగొండ ప్రమీల…. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ భార్య అని పోలీసులు చెప్పారు. బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట ప్రమీల సొంత స్థలం అని వివరించారు. ఏఓబీలో డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ (డిసీఎం)గా ప్రమీల కొనసాగుతోందని అన్నారు.

మరోవైపు… జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ఉంటున్న ప్రమీల అలియాస్ జిలానీ బేగం కుటుంబసభ్యులు దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదంటున్నారు. ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రమీల మృతి చెందిందని ఎవరూ అధికారికంగా చెప్పలేదని ఆమె సోదరుడు సత్యం చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates