ఏకాగ్రత కోసమే : డ్రైవింగ్ స్కూల్ కొత్త ఆలోచన

డ్రైవింగ్ స్కూల్స్ ఇచ్చే ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఏ మాత్రం పొరపాట్లు జరిగినా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదముంది.  అయితే డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో  ఏమాత్రం పొరపాటు జరిగినా కేవలం యాక్సిడెంట్లు జరగటం మాత్రమే కాకుండా మన ఫోన్లు కూడా పగులుతాయని మీకు తెలుసా?

చైనాలోని షాన్డాంగ్ ఫ్రావిన్స్ లోని డెజోవ్ లోని ఓ డ్రైవింగ్ స్కూల్ తమ స్టూడెంట్స్ డ్రైవింగ్ సమయంలో ఎక్స్ ట్రా అటెన్షన్ నిలపడానికి ఓ వినూత్న పద్దతి పాటిస్తుంది. టెస్ట్ రన్ సమయంలో నిర్ధేశించిన పసుపు రంగును దాటి వాహనం నడపకుండా ఉండేందుకు స్టూడెంట్స్ మొబైల్ ఫోన్లను ఆ పసుపు లైన్ పై వరుసగా ఉంచారు. దీంతో విద్యార్ధులు నెమ్మదిగా ఫోన్లకు తాము నడుపుతున్న వెహికల్ టైర్లు తగలకుండా జాగ్రత్తగా నడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates