ఏడాది తర్వాత శ్రీవారి సేవలో గవర్నర్ నరసింహన్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. ఏడాది తర్వాత శ్రీవారి సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు నరసింహన్. మహా సంప్రోక్షణం తర్వాత శ్రీవారి ఆలయం కొత్తగా తయారైనట్టుగా అనిపించిందన్నారు. తిరుమలలో పరిశుభ్రంగా ఉంచుతున్న టీటీడీని ప్రశంసించారు గవర్నర్. దర్శనం తర్వాత… నరసింహన్ కు స్వామివారి ప్రసాదాలు, 2019 టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

 

Posted in Uncategorized

Latest Updates