ఏడు రాష్ట్రాల్లో రైతుల ఆందోళన : పాలు, కూరగాయలు సరఫరా బంద్

FORMERSపండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రgపై మండిపడుతున్నారు అన్నదాతలు. ఈ క్రమంలోనే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు రైతులు. శుక్రవారం (జూన్-1) నుంచి 10 రోజులు ధర్నా, నిరసనలు చేపట్టనున్నారు. పండించిన కూరగాయలు, పాలు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకుండా బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే శుక్రవారం (జూన్-1) మహారాష్ట్రలో 130 మంది రైతులు రాష్ట్రీయ కిసాన్ మహాసాంగ్ (RKM) ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్ల పక్కన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు..హర్యానా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రైతులు కూడా ఈ ఆందోళనలకు మద్దతుగా రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలకు మధ్యప్రదేశ్ లో ఆలుగడ్డ ధరలు పడిపోయాయని చెబుతున్నారు రైతులు. టమోట, దోస, మిర్చి, పాల ధరలు రోజు రోజుకి తగ్గడంపై భగ్గుమంటున్నారు అన్నదాతలు. మద్దతు ధరపై కేంద్రం మాటతప్పుతుందని.. డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లోని రైతులు 17 జాతీయ రహదారుల్లో ఈ ఆందోళనలు చేయనున్నారు. రోడ్ల పక్కన నిరసనలు తెలుపుతూ.. దేశానికి తమ బాధ తెలియజేస్తాం అంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates