ఏదైనా జరగొచ్చు : సినిమాలకు సమంత గుడ్ బై?

samantha-good-byeఅక్కినేని కోడలు, టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు గుడ్ బై చెబుతోందా.. మరో ఏడాది మాత్రమే వెండి తెరపై కనిపించనుందా.. చేతిలోని ఐదు సినిమాలను కంప్లీట్ చేసి సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నదా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ.. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. సోషల్ మీడియాలోనూ రచ్చ. టాప్ హీరోయిన్ ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పటానికి కారణం కుటుంబం కావాలని కోరుకోవటమే.

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత. సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ దూసుకెళ్తున్నారు. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వచ్చిన రంగస్థలం మూవీ ఆమె నటనకు ఓ మైలురాయి. ఈ బిజీలో పడి కుటుంబం గురించి ఆలోచించకపోతే.. భవిష్యత్ లో బాధపడటం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారంట. చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేసి.. మూడు, నాలుగు ఏళ్లు భర్త, పిల్లలతో ఓ గృహిణిగా హాయిగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారంట. అందులో భాగంగానే కొత్తగా ఏ ఒక్క సినిమాను అంగీకరించటం లేదని సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు చెబుతున్నారు. ఇంకా నటిస్తూనే ఉంటే.. మరో మూడు, నాలుగు సంవత్సరాలకు ఆటోమేటిక్ గా ఆఫర్స్ తగ్గుతాయి. అప్పుడు తప్పుకునే కంటే.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే.. పిల్లల గురించి ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయంలో ఉందంట సమంత. ప్రస్తుతం సమంత వయస్సు 31.. ఇదే రైట్ టైం అంటున్నారు. భర్త నాగచైతన్యతోపాటు సమంత కూడా ఏకాభిప్రాయానికి వచ్చారంట. అందులో భాగంగానే కొత్త సినిమాలు అంగీకరించటం లేదనే సినిమా ఇండస్ట్రీ టాక్.

ఎటూ సినీ ఇండస్ట్రీ ఫ్యామిలీ, టాప్ హీరోయిన్.. నాలుగేళ్ల తర్వాత కూడా నటించొచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడే రంగు వేసుకోవచ్చు.. సొంత బ్యానర్.. స్టూడియో ఉంది.. ఇంకేం కావాలి. సమంత తలచుకుంటే ఇప్పుడు కాకపోతే.. అప్పుడు అయినా ఆఫర్స్ రావా.. ఇవ్వరా ఏంటీ.. అందుకే సమంత.. ఇప్పుడే సినిమాలకు బ్రేక్ ఇద్దామని ఆలోచిస్తుంది అంట.. ఇదంతా రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. జాతీయ పత్రికల్లో సైతం రావటం విశేషం. ఇది నిజమా కాదా అనేది అక్కినేని సమంత లేదా నాగ చైతన్య మాత్రమే చెప్పాలి. అయినా రెండు రోజులుగా మౌనంగానే వింటున్నారు.. చూస్తున్నారు.. ప్రస్తుతానికి అయితే స్పందించలేదు…

Posted in Uncategorized

Latest Updates