ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం : పార్లమెంట్ లో కుండబద్దలు కోట్టిన మోడీ

టీడీపీ ప్రభుత్వం నుంచి అవిశ్వాసం వచ్చినా కొందరు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడారన్నారు మోడీ. టీడీపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే యూటర్న్ తీసుకొందన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే స్వయంగా చంద్రబాబుకి ఫోన్ చేసి.. మీరు వైసీపీ ఉచ్చులో చిక్కుకున్నారని చంద్రబాబుకి చెప్పానన్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్… ఆంధ్రులను పట్టించుకోకుండా పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారన్నారు. ఆంధ్ర ప్రజలకు విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నానన్నారు. ప్యాకేజీని స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానించారన్నారు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామన్నారు. స్పెషల్ ప్యాకేజీకి చంద్రబాబు సర్కార్ ధన్యవాధ తీర్మానం చేసి పంపిందన్నారు మోడీ.

14 వ ఆర్ధిక సంఘం తమకు కొన్ని పరిమితులు విధించిందన్నారు. హోదా కన్నా ప్యాకేజీయే ముఖ్యమని ఓ టీడీపీ నేత తనతో చెప్పారని మోడీ అన్నారు. రాజధాని సహా పలు అంశాల్లో, ఏపీ ప్రజల అభివృద్దిలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్దిలో లోటు రానివ్వమన్నారు. కట్టుబడి ఉన్నామన్నారు. పలు అంశాల విషయంలో టీఆర్ ఎస్ హుందాగా వ్యవహరించిందన్నారు.

వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, ఆ రాష్ట్రాలన్ని ఇప్పుడు అభివృద్ది పథంలో పయనిస్తున్నాయన్నారు. ఏపీలో వివాదం ఉంటే సభలో సమస్య పరిష్కారం కోరుతున్నారన్నారు. మోడీ ప్రసంగ సమయంలో టీడీపీ ఎంపీలు వెల్ లోకి వెచ్చి ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అయినా మోడీ పట్టించుకోకుండా ప్రసంగించారు. పలు అంశాల విషయంలో టీఆర్ ఎస్ హుందాగా వ్యవహరించిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates