ఏపీకి విభజన హామీల్లో కొన్ని నెరవేర్చాం : జైట్లీ

Arun-Jaitelyఆంధ్రప్రదేశ్ కు సహాయంపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. విభజన హామీల్లో కొన్నింటిని నెరవేర్చామన్నారు. మరికొన్ని ప్రాసెస్ లో ఉన్నట్టు చెప్పారు. రెవెన్యూ లోటుకు సంబంధించి.. 3 వేల కోట్లకు పైగా సహాయం చేశామన్న జైట్లీ.. మిగిలిన సహాయంపైనా లెక్క చేస్తున్నామన్నారు. రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ పై సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం (ఫిబ్రవరి-9) కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానమిచ్చారు. లోక్‌సభలో చెప్పిందే ఇక్కడా చెప్పారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం కోసం తాము కూడా పట్టుబట్టామని జైట్లీ చెప్పారు. విభజనతో ఏపీ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమంటూనే మొదటి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ.3979 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇతర అంశాలు పరిశీలిస్తున్నామని, వివిధ శాఖలతో చర్చిస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates