ఏపీలో ఉప ఎన్నికలు లేవు : సీఈసీ

ఏపీలోని ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవ‌ని, సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఓపీ రావత్ తెలిపారు. శనివారం(అక్టోబర్-6) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఈ ఏడాది ఏప్రిల్ లో ఐదుగురు వైసీపీ ఎంపీలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఎంపీల రాజీనామాలను జూన్-4న ఆమోదించారు. లోక్‌ సభ గడువు 2019, జూన్-3తో ముగియనుంది. కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఏపీలో  ఉప ఎన్నికలు నిర్వహించమని రావత్ సృష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates