ఏపీలో కొనసాగుతున్న విపక్షాల బంద్

APవిభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ APలో… ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో…. రాష్ట్ర బంద్  కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రతిపక్ష వైసీపీ, కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ పార్టీలు సహా… ప్రజాసంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. తిరుపతిలో తెల్లవారుజామునుంచే.. బస్ డిపోల ముందు ఆందోళనలు చేస్తున్నారు నిరసనకారులు. RTC సేవలు నిలిచిపోయాయి. తిరుపతి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో టూ వీలర్ కు నిప్పుపెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా బందోబస్తును కూడా పెంచారు.

తిరుపతి పట్టణంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మోడీ హటావ్.. దేశ్ బచావ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పూర్ణకుంభం సర్కిల్ లో ఖోఖో  ఆడుతూ మహిళలు నిరసన తెలిపారు. తిరుపతి బస్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ లో లెఫ్ట్, కాంగ్రెస్ తో పాటు..  YCP శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. బంద్ సందర్భంగా… రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates