ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండల పరిధిలోని పెద్దహోతూరు సమీపంలో బుధవారం వేకువజామున ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.  ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Posted in Uncategorized

Latest Updates