ఏపీలో పొలిటికల్ హీట్ : వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

ycpప్రత్యేకహోదా, విభజన హామీల అమల కోసం ఏప్రిల్-6 న రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా చేసిన వారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి,  రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ తన భాధ్యతను నిర్వర్తించారన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. అయితే ఉప ఎన్నికలు వస్తాయో, రావో చెప్పలేనన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, స్పీకర్ తమకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారని, అయితే తాము సరదా కోసం రాజీనామా చేయలేదని, ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్దితోనే రాజీనామా చేశామని మేకపాటి తెలిపారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందటంతో ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది.

Posted in Uncategorized

Latest Updates