ఏపీలో మరో 76 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన ఒక్క రోజులో 10,567 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 76 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్​లో వెల్లడించింది. తాజా కేసుల్లో 8 మంది తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారేనని పేర్కొంది. వైరస్ బారిని పడి కర్నూలు జిల్లాలో ఇద్దరు చనిపోగా మృతుల సంఖ్య 64 కు పెరిగింది. సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,118 కి చేరుకుంది. 2,169 మంది డిశ్చార్జి అయ్యారు. 8,85 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Latest Updates