ఏపీలో వేర్వేరు ప్రమాదాల్లో..ఆరుగురు మృతి

NELLORE ACCIDENTఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శనివారం (మే-26)తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. పెళ్లకూరు సమీపంలో జీపును …ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వినుకొండ నుంచి తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం నాయుడుపాలెంకు చెందినవారు. మృతుల్లో డ్రైవర్‌, ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  బాధితులు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడు పాలెంకు చెందిన వారిగా గుర్తించారు. ఒకే కుటుంబ సభ్యులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

అలాగే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో పడవ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో జాలర్ల కుటుంబానికి ఇద్దరు చనిపోయారు. రాజధాని ప్రాంతమైన బోరుపాలెం ఇసుకరీచ్ లో చాపల వేటకు వెళ్లిన జాలర్ల బోటును.. ఇసుక పడవ ఢీకొట్టింది. దీంతో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన తల్లికూతుళ్లు మాధవి, కావ్య చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates