ఏపీలో హోదా ఉద్యమం : వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా ఆమోదం

YCP mpsఏపీ రాష్ట్రంలో హోదా ఉద్యమం మరోసారి హీట్ పెంచింది. రెండు నెలల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. జూన్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు లోక్ సభ ఆవరణలో స్పీకర్ తో భేటీ అయ్యారు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, వరప్రసాద్. రాజీనామాలు ఆమోదించాలని కోరారు. లేఖలు అందించి చాలా కాలం అయ్యిందని.. రీ కన్ఫర్మేషన్ లేఖలు అందించాల్సిందిగా కోరారు స్పీకర్. దీనికి అంగీకరించిన ఎంపీలు.. మరికొద్ది సేపట్లోనే మరోసారి రాజీనామా లేఖలను స్పీకర్ కు స్వయంగా అందించనున్నారు.

ఐదుగురు ఎంపీల రీ కన్ఫర్మేషన్ లేఖలు స్పీకర్ కు అందిన వెంటనే.. అధికారికంగా ప్రకటన వెలువడనుంది. మొదటి నుంచి ప్రత్యేక హోదా ఉద్యమంలోనే ఉన్నాం అని.. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పదవుల కంటే.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరి వల్లే హోదా రాలేదన్నారు ఎంపీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీలపైనా అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు..

Posted in Uncategorized

Latest Updates