ఏపీలో 765 పాజిటివ్‌ కేసులు.. చేసిన టెస్టులు 24962

  • మొత్తం కేసుల సంఖ్య 17,699

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో విదేశాలకు చెందిన వారు 6గురు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 32 మంది ఉన్నారు. రాష్ట్రానికి చెందిన వారికి 727 మందికి పాజిటివ్‌ వచ్చింది. 24 గంటట్లో 24,962 టెస్టులు చేశారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,699కి చేరింది. వారిలో ఇప్పటి వరకు 8008 మంది డిశ్చార్జ్‌ కాగా.. 9473 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో చనిపోయారరు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 218కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

Latest Updates