బడ్జెట్ లో రైతులకు కేటాయించింది ఏమీలేదు: కవిత

kavithaకాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. అలా కాకపోతే రాష్ట్రానికి సహాయమందించాలన్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా లోక్ సభలో కవిత మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ను చూసి రైతులు నిరుత్సాహం చెందారన్నారు. మొదటి బడ్జెట్‌లో రైతుల కోసం కృషి చేస్తామన్నారు, కానీ అలా జరగడంలేదని ఎంపీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 2022 లోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.. అయితే బడ్జెట్ కేటాయింపులు ఆ దిశగా లేవని ఆమె తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీకి మద్దుతు తాము ఇచ్చామని.. కానీ కేంద్రం రైతులకు ఎందుకు అండగా నిలువలేకపోయిందన్నారు. ఎరువుల ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీపై రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. వ్యాపార రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత.. వ్యవసాయ రంగానికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సాగునీటి రంగానికి కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదన్న కవిత… 1968 నుంచి పెస్టిసైడ్స్ బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు.

విభజన సమస్యల విషయంలో ఏపీ ఎంపీల ఆందోళనకు సపోర్ట్ చేస్తామన్నారు ఎంపీ కవిత.

Posted in Uncategorized

Latest Updates