ఏపీ ఎంపీల నినాదాలతో.. లోక్ సభలో గందరగోళం

MODIపార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళన మూడోరోజూ బుధవారం (ఫిబ్రవరి-7) కొనసాగుతోంది. లోక్‌సభ ప్రారంభం కాగానే ఎంపీలు ప్లకార్డులతో ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభలోనూ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది.

అంతకుముందుకు పార్లమెంటు గేట్‌-1 వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ఏపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఓ పక్క మోడీ మాట్లాడుతున్నా లెక్కచేయకుండా వెల్ లోనే నిరసన తెలిపారు. లోక్‌సభలో మోడీ ప్రసంగానికి ముందే వైసీపీ పార్లమెంటు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ప్రధానమంత్రి ప్రసంగించే సమయానికే వైసీపీ సభ్యులు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates