ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా

PARAఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేశారు డాక్టర్ పరకాల ప్రభాకర్. రాజీనామా లేఖను చంద్రబాబుకి పంపించారు. కొన్నిరోజులుగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్ధాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పరకాల తెలిపారు. తన పేరుని ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏపీ ప్రభుత్వంలో పరకాల క్యాబినెట్ ర్యాంక్ లో కొనసాగుతున్నారు. పరకాల ప్రభాకర్‌ భార్య నిర్మలా సీతారామన్‌ భారత రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. పరకాల ప్రభాకర్ గతంలో బీజేపీ అధికార ప్రతినిధిగా, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధిగా పనిచేశారు.

Posted in Uncategorized

Latest Updates