ఏపీ భవన్ లో చంద్రబాబుని కలిసిన కేజ్రీవాల్

kejriఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. ఈ రోజు(ఏప్రిల్4) ఉదయం ఏపీ భవన్ కు వచ్చిన కేజ్రీవాల్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, నిధుల విషయంలో మోడీ సర్కార్ పై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న కేజ్రీవాల్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి, ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాటం సాగిస్తున్న చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌లో భేటీ తరువాత మరికొందరు జాతీయ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates