ఏపీ భవన్ లో బాబుతో భేటీ అయిన మమతా, కుమారస్వామి, పిన్నరయి

BVఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ. ఆదివారం(జూన్-17) ఉదయం 10 గంటలకు జరిగే నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుని ఏపీ భవన్ లో కలిశారు మమతా బెనర్జీ. మమతతో పాటు కేరళ సీఎం పిన్నరయి విజయన్, కర్ణాటక సీఎం హెచ్ డి కుమారస్వామి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణాయాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను, విభజన హామీలు అమలును చంద్రబాబు ప్రస్తావించే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates