ఏపీ యువకుడికి కేటీఆర్ ధన్యవాదాలు

తెలంగాణలో మరోసారి TRS పార్టీనే అధికారంలోకి రావాలని…కేసీఆరే  సీఎం కావాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ట్విట్టర్ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. రోహిత్ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ కేటీఆర్  తెలిపారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్.. కేసీఆర్, TRSకు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates