ఏపీ వైపు దూసుకెళ్తున్న పెథాయ్ తుపాను

 నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఆంద్రప్రదేశ్ వైపు దూసుకెళ్తుంది. డిసెంబర్ 17 నాటికి..  మచిలీపట్నం – కాకినాడ తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పెథాన్ ధాటికి పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలకు నష్టం ఉంటుందని అధికారులు తెలిపారు. ముందస్తుగా.. పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే.. 50కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈస్ట్ గోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాలకు నిత్యావసరాల సరఫరా పూర్తి చేశామని. ప్రభావిత గ్రామాల్లో సిబ్బంది తో కూడిన గస్తీ బృందాలను ఏర్పాటు చేశామని వెస్ట్ గోదావరి కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కృష్ణాజిల్లా పాలకాయితిప్ప గ్రామసమీపంలో సముద్రం సుమారు 100 మీటర్లకుపైగా ముందుకు వచ్చింది.

సీఎం కు గవర్నర్ ఫోన్ :
పెథాయ్ తుఫాను వల్ల  తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఏపీ సీఎం కు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates