ఏపీ సీఎంకు చిన్న మెదడు చిట్లిపోయింది: ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్  సీఎం చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయిందన్నారు YCP ఎమ్మెల్యే రోజా.  గురువారం(ఆగస్టు-2) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా… ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యనించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రజల భవిష్యత్ ను బాబు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. TTDని వెంటనే ఆర్టీఐ చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్ చేశారు రోజా.

Posted in Uncategorized

Latest Updates