ఏప్రిల్‌ 2న కోదండరామ్ పార్టీ ప్రకటన

kodandararamతెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన ఆవిర్భవించనున్న రాజకీయ పార్టీపై సోమవారం(2న) హైదరాబాద్‌లో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ జనసమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్టు జేఏసీ వర్గాలు తెలిపాయి. పార్టీ పేరుకు అధికారికంగా ధ్రువీకరణ అందడంతో పార్టీ పేరు, జెండా, విధివిధానాలను బహిరంగంగా ప్రకటించాలని కోదండరాం నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఈ నెల 2న పార్టీ పేరును ప్రకటిస్తారు.

ఈ నెల 4న పార్టీ జెండాను ప్రకటించి, ఆవిష్కరిస్తారు. పార్టీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా 4న ఆవిష్కరిస్తారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోనే భారీ బహిరంగసభను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు కోదండరాం. తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు హైదరాబాద్ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో అనుమతిని ఇవ్వాలని జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, ఎల్బీనగర్‌ నియోజకవర్గ చైర్మన్‌ కె.వి.రంగారెడ్డి శనివారం(మార్చి-31) రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్, ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావును కలసి వినతిపత్రం అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates