ఏప్రిల్ నుంచి ఫ్రీగా దంత పరీక్షలు

తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం పూర్తయిన తర్వాత ENT దంత పరీక్షలకు నిర్వహించేందుకు రెడీ అయ్యింది వైద్య ఆరోగ్యశాఖ. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ఆరోగ్యశాఖ అధికారులు గ్రామగ్రామాన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కంటివెలుగు మార్చి-2019తో ముగియనుంది. ఏప్రిల్ నుంచి దంత, ENT వైద్యశిబిరాలను నిర్వహించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రివర్గం ఏర్పాటయ్యాక వైద్య, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో కసరత్తు చేస్తారు.  వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నట్లు కనీసం 2 కోట్ల మందికి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ‘కంటి వెలుగు’కార్యక్రమం మాదిరిగా ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈఎన్‌టీ, దంత స్క్రీనింగ్‌ చేశాక లోపాలను గుర్తించి వారికి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తారు.

Posted in Uncategorized

Latest Updates