ఏప్రిల్ నుంచి 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు..

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రగతి భవన్ లో నిన్న (ఆదివారం) సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పెన్షన్లకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను ఆదేశించారు.లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త  పెన్షన్లు అందివ్వాలని కేసీఆర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates