ఏప్రిల్ 1నుంచి వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న వాహనదారులు ఇకపై అలర్ట్ కావాల్సిందే.. ఏప్రిల్ 1నుంచి అన్ని వాహనాలు ట్యాంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ కలిగిన నంబర్ ప్లేట్స్(హెచ్ఎస్ఆర్ పి) కలిగి ఉండాలని.. అవసరం అనుకుంటే నంబర్ ప్లేట్స్ పై హోలోగ్రామ్ స్టిక్కర్ కూడా ఉండాలని కేంద్రం తెలిపింది. వెహికల్స్ తయారు చేసే కంపెనీలు ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియచేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో తెలిపారు.

సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌ 1989 యాక్ట్, 2001 హెచ్‌ఎస్‌ఆర్ పి ఆర్డర్స్‌ ను సవరించినప్పుడు  ప్రజల నుంచి వచ్చిన వినతులు/ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ చెప్పారు. ఈ నిర్ణయానికి   రాష్ట్రాల రవాణాశాఖలు, ఆటోమోటివ్‌ రీసెర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్ పోర్ట్, సెంట్రల్‌ రోడ్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌, సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ మ్యానుఫాక్చర్స్‌ ప్రతినిధులు అంగీకారం తెలపారని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates