ఏప్రిల్ 21న పాలిసెట్

TSPOLYCET2018ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకోసం ఏప్రిల్ 21న పాలిసెట్ 2018ను నిర్వహించనుంది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆమోదం తెలిపారని చెప్పారు సాంకేతిక విద్యా మండలి సెక్రటరీ బీ వెంకటేశ్వర్లు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 11వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారాయన. 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో 44,451 సీట్లు ఉన్నాయన్నారు. అయితే ఏఐసీటీఈ ప్రకారం 2018-19 విద్యా సంవత్సరం ప్రైవేటు పాలిటెక్నిక్ కళశాలల అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారాయన.

Posted in Uncategorized

Latest Updates