ఏప్రిల్ లో కొత్త రేషన్ కార్డులు : ఈటల

eetala RATION CARDతెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏప్రిల్ లో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఆదివారం (మార్చి-25) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం ఇప్పటి వరకు 89 వేల 713 దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. 77 వేల 100 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశామని చెప్పారు. మరో ఒక లక్షా 66 వేల దరఖాస్తులు పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆహార భద్రత చట్టాన్ని 2015 నుంచి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మార్వాడీ కొట్టులా ఉండకూడదని.. పేదల దుఖాన్ని తీర్చేలా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 82.64 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పు బియ్యం ఇస్తున్నామన్న ఈటల.. కొన్ని ప్రాంతాల్లో ఈపాస్ అమలు చేస్తున్నామన్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని.. ఇప్పటి వరకు 175 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. 8 మందిపై పీడీయాక్ట్ నమోదు చేశామని చెప్పారు మంత్రి ఈటల రాజేందర్.

Posted in Uncategorized

Latest Updates