ఏప్రిల్ 8న JEE మెయిన్స్

JEEIIT,NIT కేంద్రీయ విద్యాసంస్థలలో సీట్ల భర్తీ కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏప్రిల్ 8న రాత పరీక్ష నిర్వహించాడంతో పాటు.. 15,16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నుంచి దాదాపు 1.25 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జేఈఈ మెయిన్ -2018 వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా 258 నగరాలలోJEE మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్ పరీక్షలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లో నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates