ఏమనుకుంటున్నారు వీళ్లు : సీఎం ఇంట్లోనే.. సీఎస్ ను కొట్టిన ఎమ్మెల్యే

delhi
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రకంపనలు. దేశం మొత్తం నివ్వెరపోయిన ఘటన ఇది. సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన చీఫ్ సెక్రటరీ (CS)ను కొట్టారు ఇద్దరు ఎమ్మెల్యేలు. దీనిపై సీఎస్ కేంద్రానికి, IAS అసోసియేషన్ కు కంప్లయింట్ చేయటంతో వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం రాత్రి సీఎం కేజ్రీవాల్ ఇంట్లో వివిధ పథకాలపై సమీక్ష సమావేశం జరిగింది. దీనికి సీఎస్ అన్షు ప్రకాశ్ తోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరటంలో అధికారులు విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎస్ అన్షు ప్రకాశ్ సమాధానం ఇస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే అమనాతుల్లా అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగింది. ఇందులో సీఎస్ ప్రకాశ్ జోక్యం చేసుకుని సర్ధి చెప్పబోయారు. వ్యవహారం కాస్తా.. సీఎస్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది.

ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆవేశాన్ని ఆపుకోలేకపోయినా ఎమ్మెల్యే అమనాతుల్లా.. సీఎస్ అన్షుప్రకాశ్ పై చేయి చేసుకున్నారు. పరిస్థితి కంట్రోల్ తప్పటంతో మిగతా ఎమ్మెల్యేలు, అధికారులు ఎమ్మెల్యేను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కేంద్రం, అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు సీఎస్. ఈ అంశంపై చర్చించటానికి ఐఏఎస్ అసోసియేషన్ కూడా భేటీ అయ్యింది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి.

Posted in Uncategorized

Latest Updates