ఏమైంది పాపం : వందల కోతులు ఒకేసారి మృతి

kotiఅనుమానాస్పద స్ధితిలో పెద్ద సంఖ్యలో కోతులు చనిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ గ్రామ వాసులు. నిన్నటి వరకూ తమ ముందు సంతోషంగా ఆడుతూ తిరిగే కోతులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో గ్రామస్ధలు ఆందోళనకు గురౌతున్నారు.  ఇప్పటి వరకూ 100కి పైగా కోతులు అనుమానాస్పదస్థితిలో చనిపోయాయి. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకుని కోతుల మృతికి గల కారణాలను అణ్వేషిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.  గ్రామంలోని డ్రైనేజీలో ఉన్న శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. చనిపోయిన కోతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం బరేలికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates