ఏమైపోయారు : అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ మిస్సింగ్

SUNDEPఅమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం సంచలనంగా మారింది. గుజరాత్ రాష్ట్రం సూరత్ కి చెందిన సందీప్ తొట్టపిల్లై (42) కుటుంబం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటుంది. సందీప్ లాస్ ఏంజిల్స్ లోని సిటీ యూనియన్ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 5న భార్య సౌమ్య(38), కుమారుడు సిద్దాంత్ (12), సాచీ (9)తో కలిసి సందీప్ ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాకు కారులో బయలుదేరారు. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. దీంతో సందీప్ కుటుంబం వారిని వెతుకులాడేందుకు సహాయం చేయాలంటూ అమెరికా, భారత్ అధికారులను కోరుతున్నారు. వారి సెల్ ఫోన్లు కూడా పనిచేయటం లేదని చెబుతున్నారు. ఐదు రోజులుగా ఎక్కడున్నారో.. ఏమైపోయారో అర్థం కావటం లేదని మిత్రులు, బంధువులు చెబుతున్నారు. కారుతో సహా మిస్ కావటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

సందీప్ తండ్రి బాబు సుబ్రమణ్యం కంప్లయింట్ ఆధారంగా అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి.. వేట మొదలుపెట్టారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి కూడా సుబ్రమణ్యం ట్వీట్ చేశారు. యూఎస్ అధికారులు అలర్ట్ చేసి మిస్ అయిన సందీప్ కుటుంబాన్ని కనిపెట్టేందుకు చొరవ తీసుకోవాలని ఆమెకు ట్వీట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా యూజర్లు తమ సపోర్ట్ ని సోషల్ మీడియా ద్వారా సందీప్ కుటుంబానికి అందిస్తూ అండగా నిలుస్తున్నారు.


Posted in Uncategorized

Latest Updates