ఏరిపారేస్తున్నారు : కశ్మీర్ లో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చిన సీఆర్పీఎఫ్

KASజమ్మూకశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. కుల్గాం జిల్లాలోని చద్దర్ భాన్ ఏరియాలో ఎన్ కౌంటర్ అయింది. ఆర్మీ ప్యాట్రోల్ పార్టీపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఎన్ కౌంటర్ మొదలైంది. వెంటనే స్పాట్ కు చేరుకున్న CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు… ఆర్మీతో కలసి ఉగ్రవేట మొదలుపెట్టారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తయిబాకు చెందినవాడిగా గుర్తించారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో కుల్గాం ప్రాంతంలో ఇంటర్నెట్ సర్వీస్ లు నిలిపేశారు.ఇక అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు టెర్రర్ గ్రౌండ్ వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కరుడుగట్టిన ఉగ్రవాది హమద్ ఖాన్ కోసం పనిచేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి ఒక హ్యాండ్ గ్రనేడ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates