ఏర్పాట్లు పూర్తి : 8న జేఈఈ మెయిన్స్ పరీక్ష

JEEదేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ,ఐఐఎంలలో ఇంజినీరింగ్, బీటెక్, బీఆర్క్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్ ప్రవేశ పరీక్షను ఈ నెల 8న నిర్వహించనున్నట్లు సిటీ కోఆర్డినేటర్ జి.మథ్యాస్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో 10 వేల 800 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు.

పరీక్షలు ఉదయం 9-30 గంటల నుంచి 12-30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పరీక్షలకోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. హాల్‌టికెట్లు అంద‌ని వారు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జేఈఈ మేయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 8 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా కేంద్రాలకు హాల్‌టికెట్, ఐడీ ప్రూఫ్ మినహా ఎలాంటి వస్తువులను, పరికరాలను అనుమతించబోరని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని ఆయన సూచించారు. విద్యార్థులకు పెన్నులు కూడా పరీక్షా కేంద్రంలోనే అందజేస్తామని ఆయన తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates