ఏలియన్స్‌ వచ్చారు.. మనమే గుర్తించలేదు : నాసా సైంటిస్టులు

గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చుంటారని, మనమే వాళ్లను గుర్తించకపోయుండొచ్చని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఏలియన్స్‌ కార్బన్‌తో చేసిన జీవులై ఉంటారని మనం భావిస్తున్నామని, కానీ వారు అంతకన్నా వైవిధ్యంగా ఉండొచ్చని, అందుకే మనకు కనబడకపోయుండొచ్చని వివరించారు. మన దగ్గర10 వేల ఏళ్ల కిందట నాగరికత ఊపిరిపోసుకుందని, 500 ఏళ్ల నుంచి సైన్స్‌ అభివృద్ధి ప్రారంభమైందన్నారు.

మనం కనుగొన్న శాస్త్రసాంకేతికత, తెలుసుకోవాలనుకుంటున్నసైన్స్‌ అంతా మనలాంటి కార్బన్‌ జీవుల వైపే తిరుగుతోందని, అందుకే గ్రహాంతరవాసుల గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నామని చెప్పారు. ఏలియన్స్‌ పై ప్రస్తుతమున్నఊహను పక్కనబెట్టి కొత్తగా ఆలోచిస్తేనే వారి గురించి మరిన్ని వివరాలు రాబట్టొచ్చన్నారు. గ్రహాంతరవాసులకు వివిధ నక్షత్ర మండలాలకు వెళ్లే సాంకేతికత ఉందని అనుకుంటేనే మంచిదని సూచించారు. యూఎఫ్‌ వో (అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌‌‌‌) ప్రయాణాలపై మనకు ఎక్కువగా నమ్మకం లేదని, ఎవరైనామాట్లాడితే తమాషాగా చూస్తామని, అందుకే ఆ వైపు నుంచి సైంటిస్టులు ప్రయత్నాలు చేయట్లేదని పేర్కొన్నారు. స్పేస్‌‌‌‌ టైమ్‌ , దానికి సంబంధించిన ఊహలను సైంటిస్టులు తీవ్రంగా పరిగణించి లోతుగా పరిశోధన చేయాలని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates