కోదండరాం గారు… మహాకూటమితో పొత్తు ఏ అమరుడు కోరాడు? : కేటీఆర్

సిరిసిల్ల : ఏ అమరవీరుడు కోరాడని ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్‌ నేతల చుట్టూ ప్రొఫెసర్‌ కోదండరాం పొర్లు దండాలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో నిన్న(మంగళవారం) సమీక్ష నిర్వహించిన అనంతరం బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు ఆయన. ఆత్మగౌరవం కోసం అంటూ పార్టీ స్థాపించిన కోదండరాం కాంగ్రెస్‌తో జత కట్టి ఆత్మవంచన చేసుకోవద్దన్నారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి కొడతారని ఆ పార్టీకి చెందిన ఏపీ మంత్రులు కేఈ కృష్టమూర్తి, చినరాజప్ప, అయ్యన్నపాత్రులు అంటుంటే… ఏ కారణంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారో ఇక్కడి టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates