ఏ దేశంలో తెలుసా : ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. లీటర్ పెట్రోల్ 57పైసలే

venzulaమన దేశంలో రోజువారీగా పెరిగే పెట్రోల్, డీజిల్ పైసలతో అక్కడ లీటర్ పెట్రోల్ కొనుక్కోవచ్చు.. మన దగ్గర రూపాయి ఇచ్చినా పాయింట్ పెట్రోల్ కొట్టరు.. కానీ ఆ దేశంలో మాత్రం డాలర్ తో పోల్చితే 67 పైసలు, అదే భారతీయ రూపాయితో లెక్క కడితే లీటర్ పెట్రోల్ కేవలం 57పైసలు మాత్రమే. అదేమైనా డబ్బులు దండిగా ఉన్న దేశం కాదు.. ఆర్థిక సంక్షోభం విలవిలలాడుతూ.. ఆహార కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనుజులా దేశం. 2018, జూన్ 2వ తేదీ నాటికి భారతీయ రూపాయితో పోల్చితే లీటర్ పెట్రోల్ కేవలం 57పైసలు మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత ధర తక్కువగా.. ఓ రకంగా చెప్పాలంటే ఫ్రీగా పెట్రోల్ ఇస్తున్న దేశంగా చెప్పొచ్చు. ఆ తర్వాత 19 రూపాయలతో ఇరాన్ రెండో దేశంగా నిలిచింది.

ఓ వైపు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ వెనిజులా దేశం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లీటరు కేవలం 57 పైసలకు అందిస్తుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు ఆ దేశంలో ఉండటం ఓ కారణమైతే, , ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోలు పై రాయితీలు ఇస్తుండటం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పెట్రోల్ తక్కువ ధరకు లభించడానికి కారణం. ఇక భారీ చమురు నిల్వలు కలిగిన దేశాల్లో రెండవ స్ధానంలో ఉన్న  సౌదీ అరేబియాలో మాత్రం  పెట్రోలు ధరల విషయంలో 13వ స్ధానంలో ఉంది. సౌదీ అరేబియాలో లీటరు పెట్రోలు ధర రూ.36.40 ఉండగా, ఇరాన్‌లో 18.88 రూపాయలకు, సూడాన్‌లో 22.93 రూపాయలకు లీటరు పెట్రోలు లభిస్తుంది. అయితే అత్యంత ఎక్కువ ధరకు పెట్రోలు దొరికే దేశం ఐస్‌ లాండ్. అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.144.96గా ఉంది.  ఆ తరువాత స్ధానంలో హాంకాంగ్‌ ఉంది. హాంకాంగ్ లో లీటరు పెట్రోలు ధర రూ. 144.31గా ఉంది.

ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చమురు ఉత్పత్తి దేశాల్లో నార్వే ఒకటిగా ఉన్నప్పటికీ అక్కడ లీటరు పెట్రోలు ధర రూ.138.20 గా ఉంది. ప్రజలందరూ ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించాలని ప్రభుత్వమే అక్కడ పెట్రోలుపై భారీగా పన్నులు విధిస్తుంది. భవిష్యత్తులు చమురు నిల్వలు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వకుండా ముందు జాగ్రత్తగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates