ఏ దేశానికీ కాకుండా పోయాడు :100 రోజులుగా ఎయిర్ పోర్టులోనే మకాం

AIRఇది ప్రపంచంలోని ఏ దేశానికీ చెందని ఓ వ్యక్తి కథ. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న సామెతకి సరిగ్గా సూట్ అవుతుంది అతడికి. మూడు నెలల నుంచి కూర్చున్న ప్లేస్ నుంచి బయటకు వెళ్లలేని పరిస్ధితి. ఉన్నచోట ఉండలేని పరిస్ధితి, బయటికెళ్తే చనిపోతానని భయం. ఈ కథ వింటుంటే ఎవ్వరికైనా మర్యాద రామన్న సినిమా గుర్తుకు వస్తుంది. అయితే కొంచెం అలాగే ఉన్నప్పటికీ ఇతడి కథ మాత్రం కొంచెం డిఫరెంట్. ఏ దేశానికి చెందని తనను అంగారకుడిపైకి పంపించాలంటూ నాసాను బతిమలాడుతున్న హాసన్ అల్‌ కొంటార్‌ (38) రియల్ లైఫ్ ఇది.

సిరియాలో పుట్టి, పెరిగిన హాసన్ అల్ కొంటార్(38) ఉద్యోగం కోసం కొన్నేళ్ల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వెళ్లాడు. బీమా ఏజెంటుగా పనిచేసేవాడు. అంతా సవ్యంగా సాగుతుంది అని హాసన్ అనుకుంటున్న టైంలో 2011లో సిరియాలో యుద్ధం మొదలైంది. విదేశాల్లో ఉన్న సిరియన్లు యుద్ధంలో పాల్గొనేందుకు స్వదేశానికి రావాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. సిరియా రూల్స్ ప్రకారం.. చదువు పూర్తి అయిన తరువాత కొంతకాలం నిర్బంధంగా మిలటరీలో పనిచేయాలి. ఒకవేళ చదువు కంప్లీట్ అయ్యే సమయానికి దేశంలో లేకపోతే.. ప్రతి ఏటా కొంత రుసుము చెల్లించి మినహాయింపు పొందవచ్చు.

ఇలాగే హసన్‌ కూడా తన చదువు అయిపోతూండగానే UAE వెళ్లిపోయాడు. యుద్ధంలో పాల్గొనాలని సిరియా ఇచ్చిన పిలుపుని హాసన్ తోసిపుచ్చాడు. దీంతో హాసన్ పాస్ పోర్ట్ ని రద్దు చేసింది సిరియా ప్రభుత్వం. దీంతో నిఘా సంస్థల కళ్లు కప్పి కొంతకాలం UAEలోనే నెట్టుకురాగలిగాడు. వర్క్ పర్మిట్ పునరుద్ధరించుకునే అవకాశం లేక ఉద్యోగంలో కొనసాగలేకపోయాడు. చివరికి UAE అధికారులు హసన్‌ను అదుపులోకి తీసుకుని 3 నెలల వర్క్‌ పర్మిట్‌ ఇచ్చి మలేసియాకు పంపించారు.

UAE నుంచి మలేషియాకు వచ్చాడు. కొన్ని రోజులు మలేషియాలో ఉన్న తర్వాత 2018, మార్చి-7న కౌలాలంపూర్‌ ఎయిర్ పోర్ట్ నుంచి ఈక్వెడార్ వెళ్లాలని భావించి టర్కీకి చెందిన విమానం టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్‌ రద్దు చేశారు అధికారులు. అప్పటి నుంచి కౌలాలంపూర్‌ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయాడు. ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్‌–2నే హాసన్ ఇళ్లుగా మార్చుకున్నాడు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నానని.. స్నానం చేసి మూడు నెలలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పరిస్ధితి చాలా ఇబ్బందికరంగా ఉందని, చిన్నప్పటి నుంచి అంతరిక్షం సినిమాలు చూశానని, అక్కడ ఎలా ఉండాలో తెలుసని, కొన్నేళ్లలో అంగారకుడిపైకి పంపుతున్నవారిలో తననూ చేర్చుకొమ్మని సాసాని కోరుతున్నాడు. ఏ దేశం కూడా ఇప్పుడు హసన్ ను తీసుకునే పరిస్థితి లేదు. ఎవరివారు మా దేశం కాదని చెబుతుండటంతో ఎటు వెళ్లాలో కూడా అర్థం కావటం లేదంటున్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates