ఏ విధంగా ఆదర్శవంతుడు : సంజు సినిమాపై ఆరెస్సెస్ విమర్శలు

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ సంజు. జూన్-29న విడుదలైన ఈ మూవీ విమర్శల ప్రసంసలు అందుకుంటూ బాలీవుడ్ లో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. రాజ్ కుమార్ హిరాణీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో సంజయ్ దత్ గా… ప్రముఖ బాలీవుడ్ హీర్ రణబీర్ కపూర్ నటించారు. దత్ గా… రణబీర్ నటన అందరి ప్రశంసలు అందుకొంటుంది.

సంజు సినిమాపై ఆరెస్సెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. పీకే వంటి గొప్ప సినిమా తీసిన రాజ్‌ కుమార్‌ హిరాణీ.. సంజయ్‌ దత్‌ జీవిత చరిత్రను తీయడం దారుణమని,సంజయ్‌ దత్‌ జీవిత కథ ఏ ఒక్కరికీ ఆదర్శం కాదని,  నేరస్థుడిని ఎవరూ ఆరాధించరంటూ తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. ఓ వైపు హాలీవుడ్‌ లో గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు  ‘ద మ్యాన్‌ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో తెరకెక్కుతున్నాయి. అయితే  బాలీవుడ్‌ లో మాత్రం డాన్‌ ల జీవిత చరిత్రలను తెరకెక్కిస్తున్నారని తెలిపింది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ భారతీయుడు, కన్నబిడ్డను కొన్ని సంవత్సరాల వరకూ దగ్గరకు తీసుకోని ఓ తండ్రిని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా అని ప్రశ్నించింది. తల్లిదండ్రుల పట్ల బాధ్యతలేని సంజయ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించాలని రాజ్ కుమార్ హిరాణీకి ఎందుకు అనిపించిందంటూ సామ్నాలో ఓ కధనం ప్రచురించింది.

Posted in Uncategorized

Latest Updates