ఐఐటీ,ఎన్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

delఎన్ ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ టీఐల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేష్ అథారిటీ(జోసా) నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇప్పటికే సీబీఎస్ ఈ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 2.31 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్ కు అర్హులయ్యారు. మే-20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ ఎగ్జామ్ ఫలితాలను జూన్-10 న ప్రకటించేందుకు కాన్పూర్ ఐఐటీ నిర్ణయించింది. మొత్తం 7 దశల్లో ఎన్ ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ టీఐల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ చేపట్టి జులై-19 నాటికి కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఐఐటీల్లో 11 వేలు, ఎన్ ఐటీల్లో 18 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 3వేల343 సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది.  జూన్-27 ఉదయం 10 గంటలకు మొదటిదశ సీట్లు కేటాయింపు జరగనుంది. జులై 19న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, నీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్ ,కాలేజీల్లో చేరడం ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates