ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు : మోడీ

modiఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు. తర్వాత సదస్సును ఉద్దేశించి మాట్లాడారు.

డిజిటల్‌ సాంకేతికత ఆవిర్భావానికి భారత్‌ ప్రధాన కేంద్రమన్నారు మోడీ. ఇండియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ జరగడం ఇదే మొదటిదన్నారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్‌, హైదరాబాద్‌ ఆహ్వానం పలుకుతోందన్నారు. లక్ష గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానించామన్నారు. డిజిటల్‌ ఇండియా దిశగా మా ప్రయాణం కొనసాగుతోందన్నారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates