ఐటీకి ట్రంప్ షాక్ : H-1B వీసా మరింత కఠినం

ITఅమెరికా ఉద్యోగాలు – అమెరికాకే అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో H-1B వీసాల జారీ విధానంలో భారీ మార్పులు చేస్తున్నారు. H-1B వీసాల విధానాన్ని మరింత కఠినం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. మూడు సంవత్సరాలు అమలయ్యే వీసాలను జారీ చేసే క్రమాన్ని రివర్స్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా. ఈ విధానం జారీ చేసే వీసాలు.. కొంత కాలం మాత్రమే చెల్లుబాటయ్యేలా కొత్త రూల్స్ తీసుకున్నారు. కేవలం 3 సంవత్సరాలలోపు మాత్రం ఇక నుంచి జారీ చేయనున్నారు. అంటే ఒకటి, రెండు సంవత్సరాలు మాత్రం ఈ వీసా జారీ ఇక నుంచి ఉంటుంది.

కొత్త విధానం ప్రకారం వీసా పొడిగింపు సమయంలో థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో.. H-1B  వీసాపై ఉన్న ఉద్యోగి ప్రత్యేక వృత్తిలో నిర్దిష్టమైన అర్హత, నాన్‌ క్వాలిఫైయింగ్ అర్హతలు కలిగి ఉన్నాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏడు పేజీల విధివిధానాలను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ జారీ చేసింది. ఇది భారత ఐటీ కంపెనీలు, ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. H-1B వీసా నూతన నిబంధనల భారతీయులకే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం జరుగుతుందని నాస్కామ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అంటున్నారు. మరికొన్ని వారాల్లో వీసా ప్రాసెసింగ్‌ ప్రారంభం అవుతున్న సమయంలో ఈ షాకింగ్‌ పాలసీ విడుదల కావటం.. భారతీయ ఐటీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

Posted in Uncategorized

Latest Updates