ఐటీతో కూడిన సిటీ ప్లానింగ్ అవసరం : కేటీఆర్

KTRనిర్మాణాత్మక పట్టణీకరణ జరగాలని.. అందుకు ITతో కూడిన మంచి పట్టణ ప్రణాళిక అవసరమన్నారు  మంత్రి కేటీఆర్.  రాష్ట్రవ్యాప్త టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో కేటీఆర్ సోమవారం (ఫిబ్రవరి-12) సమావేశమయ్యారు.  తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు.. ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన ఆశించారని.. ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే టౌన్‌ప్లానింగ్‌శాఖలోనూ అనేక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. సాధారణ పౌరుడికి పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా  DPMS  విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ విధానంలో నెలరోజుల గడువును కుదించి.. 21 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా చేశామన్నారు. DPMS విధానం పట్ల టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించిన కేటీఆర్.. సంపూర్ణ పరిజ్ఞానంతో పనిచేయాలన్నారు. ప్రజల్లో అధికార వ్యవస్థకు మరింత పేరు తెచ్చేలా ప్రతి ఒక్క ఆఫీసర్ పని చేయాలని కోరారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates