ఐటీలో 14 శాతం వృద్ధితో ముందుకెళ్తున్నాం : కేటీఆర్

ktrbఐటీ ఎగుమతుల్లో 14 శాతం వృద్ధితో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. శనివారం (ఫిబ్రవరి-10) బేగంపేట్ ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన.. సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ మీటింగ్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సీఐఐతో కలిసి మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.  హైదరాబాద్ లో ఇప్పటికే దేశంలోనే మొదటి మహిళా పారిశ్రామికవేత్తల పార్క్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి.  దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో ముందున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన కేటీఆర్..  పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నామన్నారు.

గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయని గుర్తు చేశారు. ఐటీ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates