ఐటీ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పని సరి

itఉద్యోగులంతా రకరకాల డ్రస్సుల్లో కాకుండా…అందరూ ఒకే విధమై డ్రస్సులు వేసుకునేలా చర్యలు చేపట్టింది ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్. ఇందులో భాగంగా ఆపరేషన్‌ డ్రస్‌ కోడ్‌  ను తన ఉద్యోగులందరికీ అమల్లోకి తెస్తున్నట్టు ఐటీ డిపార్ట్‌మెంట్‌ బుధవారం(ఏప్రిల్-18) తెలిపింది. ఐటీ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఓ అధికారిక ఆర్డర్‌ను జారీచేశారు. ఈ ఆర్డర్‌లో ఆదాయపు పన్నుశాఖలో అధికారులదరూ, స్టాఫ్‌ మెంబర్లూ, ఇతర అధికారులు వర్క్‌ప్లేస్‌లో చక్కగా, శుభ్రంగా, ఫార్మల్‌లో కనిపించాలని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల్లో, ముఖ్యంగా డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే యువకులు ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో వస్తున్నారని… ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ తన ఆర్డర్‌లో అన్నారు.

ఇకపై అధికారులు, స్టాఫ్‌ మెంబర్లందరూ ఫార్మల్‌గా, క్లీన్‌గా, మంచి దుస్తుల్లో ఆఫీసుల్లో కనిపించాలని ఆదేశించారు. ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను పాటించకపోతే… వారిపై చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాక వారిని మామూలు బట్టలు చేంజ్ చేసుకుని… ఫార్మల్‌గా రావడం కోసం తిరిగి ఇంటికి కూడా పంపించడంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates