ఐటీ  ఎగుమతుల్లో హైదరాబాద్ టాప్: కేటీఆర్

KTRఐటీ  ఎగుమతుల్లో  హైదరాబాద్  దేశంలోనే  టాప్ పొజిషన్ లో  ఉందన్నారు  ఐటీమంత్రి  KTR . హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ రెడీ చేశామన్నారు. ITIR పై కేంద్రం చేతులెత్తేసిన తాము ముందుకే వెళ్తామన్నారు. ఐటీశాఖ వార్షిక రిపోర్టు రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు కేటీఆర్. ఈసందర్భంగా టీవెబ్ యాప్ ను ఆవిష్కరించారు

ఐటీకీ హైదరాబాద్ కేరాఫ్ గా మారిందన్నారు ఐటీ మంత్రి కె తారకరామారావు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. తెలంగాణలో  ఏటా  93వేల  4వందల  22 కోట్ల  రూపాయల  ఎగుమతులు జరుగుతున్నాయని  చెప్పారు.  చిన్న చిన్నపట్టణాలకు కూడా ఐటీ ఇండస్ట్రీ విస్తరిస్తామన్నరు మంత్రి.

దేశ సగటు  కంటే  తెలంగాణ సగటు  5శాతం ఎక్కువగా  నమోదైందన్నారు మంత్రి కేటీఆర్.  హైదరాబాద్  చుట్టూ ఐటీ అభివృద్ధి  చేసేందుకు  లుక్ ఈస్ట్  పాలసీతో  ముందుకు పోతున్నామని  చెప్పారు. ITIRపై  కేంద్ర సహకారం  లేకపోయినా ముందుకు పోతామన్నారు.

ఈ వేదికనుంచి విడుదలైన టీ వెబ్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సమచారంతో పాటు అన్ని శాఖల వెబ్ సైట్ లింకులు, ప్రభుత్వ పథకాలు, సర్వీసుల సమాచారం అందుబాటులో రానుంది. కార్యక్రమంలో  వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఐటీ కంపెనీలకు అవార్డులు అందించారు మంత్రి కేటీఆర్.


Posted in Uncategorized

Latest Updates