ఐటీ రంగంలో హైదరాబాద్ కు ప్రపంచ గుర్తింపు : వెంకయ్య

హైదరాబాద్ ను ఐటీ కంపెనీలు ప్రపంచ పటంలో నిలుపుతాయన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం (జూలై-27) హైదరాబాద్ లోని HICC లో జరిగిన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ 26వ యానివల్ సమ్మిట్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో డిజైనర్ ఫెస్ట్ అండ్ ఎక్స్ పో ను ఏర్పాటు చేశారు.

దీనిలో భాగంగా వీ నెక్ట్స్- ఆటమ్ ప్రొడక్ట్స్ స్టాల్ ను ఏర్పాటు చేసింది విశాక ఇండస్ట్రీస్. ఉత్తమ ప్రతిభ కనబపర్చిన వివిధ ఐటీ కంపెనీలు, స్టార్టప్స్ కి 7 విభాగాల్లో అవార్డులు ఇచ్చారు వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌ ఐటీ రంగంలో నాలుగున్నర లక్షలమంది డైరెక్ట్ గా ఉపాధి పొందితే అంతకు రెండుమూడు రెట్లమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్‌ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Posted in Uncategorized

Latest Updates