ఐటీ సదస్సులో కేటీఆర్ : ఇంటింటికీ బ్రాడ్‌ బ్యాండ్‌

ktr it congressతెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ పనితీరును వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. అనేక పెద్ద IT సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నాయని తెలిపారు కేటీఆర్.

తెలంగాణలో సాంకేతికతను ఉపయోగించుకొని ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, తుమ్మలూరు, మన్సాన్‌పల్లి, సింగూర్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టుగా టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్ (TDS) ను అమలు చేస్తున్నామన్నారు. కరీంనగర్, వరంగల్‌లో IT సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates